![]() |
![]() |
.webp)
ఢీ సెమీఫైనల్స్ పోటా పోటీగా జరుగుతున్నాయి. ఈ వారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఇందులో జడ్జిగా ఉన్న పూర్ణ కన్నీళ్లు పెట్టుకుని అందరినీ ఏడిపించేసింది. పూర్ణ చెప్పిన మాటలు వింటే తన గత జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా అనే విషయం తెలుస్తుంది. పూర్ణ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను ఫేస్ చేయాల్సి వచ్చిందంటూ ఏడ్చేసారికి పక్కనే ఉన్న శేఖర్ మాష్టర్ ఆమెను ఓదార్చారు. "మా ఫామిలీలో ఎవరూ డాన్స్ క్లాస్ కి వెళ్ళింది లేదు. నేను ఒక్కదాన్నే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అమ్మాయిని. నేను డాన్స్ నేర్చుకున్న విషయం తెలిసాక మా నాన్న తరపున వాళ్ళ ఎవరూ కూడా మాతో మాట్లాడేవారు కాదు.
మా అమ్మతో మాట్లాడలేదు...మా నాన్నను కూడా పక్కన పెట్టేసారు దానికి కారణం నేను డాన్స్ నేర్చుకుని ఇండస్ట్రీకి రావడమే. ఆ సమస్యలన్నీ దాటుకుని వచ్చాను. కానీ ఒకప్పుడు ఎవరైతే మా ఫామిలీని పక్కన పెట్టారో వాళ్లంతా ఇప్పుడు మాకు బాగా క్లోజ్ ఇపోయారు. ఎవరైతే కొన్నేళ్ల పాటు నాతో మాట్లాడ్డం మానేశారో వాళ్ళు కూడా నాతో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు నేను నాకంటూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాను." అని చెప్పింది పూర్ణ.
ఇక ప్రదీప్ మాట్లాడుతూ "పూర్ణ గారు మీరు ఆ కష్టాలను అన్ని దాటుకుని ఇంత దూరం వచ్చి ఎంతో మంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్ గా మారారు. మీరు నవ్వుతూ ఉంటేనే బాగుటుంది" అన్నాడు. సైరా రాయలసీమ టీమ్ మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ లో చేసిన పనులు, అందరితో తిట్టించుకుని డాన్స్ కోసం ఇంట్లోంచి వచ్చేసిన సందర్భాలను కలిపి మంచి డాన్స్ ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో పెర్ఫార్మ్ చేసి పూర్ణని ఏడిపించేసారు. ఇక ఈ వారం షోకి "మంగళవారం" మూవీ నుంచి హీరోయిన్ పాయల్ రాజపుత్ , డైరెక్టర్ అజయ్ భూపతి గెస్ట్స్ గా వచ్చారు.
![]() |
![]() |